అమెరికాలో కరోనా వైరస్ ఎయిడ్ చెక్కులకు కాంగ్రెస్ ఆమోదం, మరి సెనేట్ లో ఏం కానుంది ? ట్రంప్ కు చుక్కెదురేనా ?

| Edited By: Anil kumar poka

Dec 29, 2020 | 5:46 PM

అమెరికాలో కరోనా వైరస్ కేసుల సాయానికి ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ డిమాండ్ మేరకు 2 వేల డాలర్ల ప్యాకేజీ చెక్కులను డెమొక్రాట్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 275, ప్రతికూలంగా 134 ఓట్లు వచ్చాయి.

అమెరికాలో  కరోనా వైరస్ ఎయిడ్ చెక్కులకు కాంగ్రెస్ ఆమోదం, మరి సెనేట్ లో ఏం కానుంది ? ట్రంప్ కు చుక్కెదురేనా ?
Follow us on

అమెరికాలో కరోనా వైరస్ కేసుల సాయానికి ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ డిమాండ్ మేరకు 2 వేల డాలర్ల ప్యాకేజీ చెక్కులను డెమొక్రాట్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 275, ప్రతికూలంగా 134 ఓట్లు వచ్చాయి. అయితే రిపబ్లికన్లు అధికంగా ఉన్న సెనేట్ లో ఈ చెక్కుల గతి ఏమవుతుందో తెలియడంలేదు. కాగా వేరుగా 740 బిలియన్ డాలర్ల డిఫెన్స్ పాలసీ వీటోను ఓవర్ రైడ్ చేసేందుకు రిపబ్లికన్లు సిధ్ధంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ట్రంప్ అధికారంనుంచి దిగిపోనుండగా ..ఆయన అధ్యక్ష పదవిలో ఉండగానే ఇది తొలి వీటో ఓవర్ రైడ్ అన్న విషయం గమనార్హం. కరోనా వైరస్ ఎయిడ్ కు సంబంధించి  దీన్ని 600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు పెంచాలని, ఇతర ఖర్చులు తగ్గించాలని ట్రంప్ ఇటీవల కోరుతూ దీనికి సంబంధించిన బిల్లుపై సంతకం చేసేందుకు నిరాకరించారు. అయితే ఆ తరువాత మనసు మార్చుకుని ఆమోదముద్ర వేశారు. తాజాగా డెమొక్రాట్లు అత్యధిక రిలీఫ్ చెక్కులను ఆశిస్తూ ఎన్నడూ లేనివిధంగా తమ ప్రతిపాదన విషయంలో ట్రంప్ తో అవగాహన కుదుర్చుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది.

పెంచిన పరిహారంతో కూడిన చెక్కులను మొత్తం 130 మంది రిపబ్లికన్లు, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇద్దరు డెమొక్రాట్లు వ్యతిరేకించారు. కానీ ఇక సెనేట్ ఈ చెక్కుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.