పాలసీని ఉల్లంఘించి ఫేస్ మాస్క్ తొలగించిన మెలనియా ట్రంప్, ఎందుకంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 3:36 PM

అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ ఓ హాస్పటల్ పాలసీని (నిబంధనను) అతిక్రమించారు. వాషింగ్టన్ లో ఓ పిల్లల ఆసుపత్రిని విజిట్ చేసిన ఆమె..పిల్లల ముందు ఓ 'హాలిడే బుక్' ను చదివే సమయంలో తన ఫేస్ మాస్క్ తొలగించారు. మొదట మాస్క్ ధరించి..

పాలసీని ఉల్లంఘించి ఫేస్ మాస్క్ తొలగించిన మెలనియా ట్రంప్, ఎందుకంటే ?
Follow us on

అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ ఓ హాస్పటల్ పాలసీని (నిబంధనను) అతిక్రమించారు. వాషింగ్టన్ లో ఓ పిల్లల ఆసుపత్రిని విజిట్ చేసిన ఆమె..పిల్లల ముందు ఓ ‘హాలిడే బుక్’ ను చదివే సమయంలో తన ఫేస్ మాస్క్ తొలగించారు. మొదట మాస్క్ ధరించి వఛ్చినప్పటికీ, హాలులోకి ఎంటరయ్యాక దాన్ని తీసేశారు. ఈ హాస్పిటల్ పాలసీ ప్రకారం, ప్రతివారు మాస్క్ ధరించాల్సిందే.. ఈ రూల్ ఇక్కడి అన్ని ప్రాంతాలకూ వర్తిస్తుంది. తాను ఎందుకు ఫేస్ మాస్క్ తొలగించిందీ మెలనియా వెల్లడించలేదు. ఆమె ఇందుకు ముందుగానే ప్రత్యేక అనుమతి తీసుకుందా అన్న విషయం కూడా తెలియలేదు. మా హాస్పిటల్ లో రోగులు, వారి కుటుంబాలు, ఉద్యోగుల సేఫ్టీకి మాస్కుల ధారణ తప్పనిసరి అని ఆసుపత్రి అధికార ప్రతినిధి డయానా చెప్పారు.

అయితే మాట్లాడే వ్యక్తికి ఇతరులు ఆరు అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాస్క్ తొలగించవచ్చు అన్నారు. మెలనియా ట్రంప్ పిల్లల ముందు కూర్చున్నప్పుడు 12 అడుగులకుపైగా దూరంలో ఉన్నారన్నారు. ఇతరులంతా మాస్కులు ధరించారన్నారు.