ఒకేసారి దేశానికి నాలుగు సంక్షోభాలు, జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ పై విమర్శ, బిల్లుపై సంతకానికి దిగివచ్చిన అధ్యక్షుడు

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 1:16 PM

దేశాన్ని ఒకేసారి 4 చరిత్రాత్మక సంక్షోభాలు చుట్టుముట్టాయని అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ అన్నారు. కోవిడ్ 19 నుంచి ఎకానమీ, ఆ తరువాత వాతావరణ మార్పులు..

ఒకేసారి దేశానికి నాలుగు సంక్షోభాలు, జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ పై విమర్శ, బిల్లుపై సంతకానికి దిగివచ్చిన అధ్యక్షుడు
Follow us on

దేశాన్ని ఒకేసారి 4 చరిత్రాత్మక సంక్షోభాలు చుట్టుముట్టాయని అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ అన్నారు. కోవిడ్ 19 నుంచి ఎకానమీ, ఆ తరువాత వాతావరణ మార్పులు, (క్లైమేట్ ఛేంజ్), అనంతరం జాతి వివక్ష ఇలా ఈ సంక్షోభాలను అమెరికా ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. జనవరి నెల రాగానే (తాను అధ్యక్ష పదవి చేబట్టగానే) సమయాన్ని వృధా చేయడమంటూ ఉండదని,  తను, తన టీమ్ కార్యాచరణకు దిగుతామని ఆయన  చెప్పారు. కోట్లాది అమెరికన్ల ప్రయోజనాలకు ఉద్దేశించిన కోవిడ్ బిల్లుపై సంతకం చేయడానికి  ట్రంప్ నిరాకరించడాన్ని ఆయన తప్పు పడుతూ.. తక్షణమే సంతకం చేయాలని కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంలో మన ప్రజలు కష్టాలనెదుర్కోలేరు..మీ బాధ్యతల నుంచి దూరంగా పారిపోకండి అని అన్నారు.కాంగ్రెస్  ఈ బిల్లును పూర్తిగా సమర్థించిందని బైడెన్ అన్నారు. కరోనా వైరస్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ వైరస్ వల్ల అమెరికాకు  చీకటి రోజులు రానున్నాయని, ఇది మన ముందు కాదు, మన వెనుకే ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు.

బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయగానే…. ట్రంప్ సంబంధిత బిల్లుపై సంతకం చేశారు.