మధ్యతరగతి ప్రజల కోసం ‘ఉపాసన హెల్త్ పాలసీ’

|

Aug 24, 2020 | 6:36 PM

ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడంలో ముందుండే ఉపాసనా కొనిదెల. మరోసారి కొత్త ప్లాన్ ను తెరమీదికి తీసుకొచ్చింది. మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే ఓ పథకాన్ని ప్లాన్ చేసింది. ఏ చిన్న పాటి అనారోగ్య..

మధ్యతరగతి ప్రజల కోసం ఉపాసన హెల్త్ పాలసీ
Follow us on

ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడంలో ముందుండే ఉపాసనా కొనిదెల. మరోసారి కొత్త ప్లాన్ ను తెరమీదికి తీసుకొచ్చింది. మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే ఓ పథకాన్ని ప్లాన్ చేసింది. ఏ చిన్న పాటి అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లే వారు చాలా మంది. అయితే  అలాంటివారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు.

ఇక కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండటంతో అది వస్తే అవుతున్న ఖర్చు కూాడా అంతకంటే భయంకరంగా ఉంటోంది. ఇలాంటి ఆకస్మిక సమస్యల నుంచి బయట పడేందుకు హెల్త్ పాలసీలను ఆశ్రయిస్తుంటారు. ఇలా హెల్త్‌ పాలసీలు తీసుకునే వారిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే అధికంగా ఉంటారు.

ఎందుకంటే వారు  ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు సుముఖంగా ఉండరు.. అలా అని లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్‌ హస్పటిల్‌కు వెళ్లే ధైర్యం కూడా చేయలేరు. దాంతో మధ్యే మార్గంగా ఆరోగ్యబీమా పాలసీలతో నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ కోడలు ఉపాసన ఓ వినూత్న ఆలోచనను శ్రీకారం చుట్టింది. బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్‌ కవరేజ్‌ మోడల్‌ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను ఉపాసన కొనిదెల ట్వీట్‌ చేశారు.

ఇన్యూరెన్స్‌ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్‌ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు.