విపక్షాలకు అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇష్టం లేదు, అందుకే అశాంతిని సృష్టిస్తున్నారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 9:42 PM

దేశంలో అశాంతిని సృష్టించేందుకు విపక్షాలు రైతులను వినియోగించుకుంటున్నాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు . అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని..

విపక్షాలకు అయోధ్యలో రామాలయ నిర్మాణం ఇష్టం లేదు, అందుకే అశాంతిని సృష్టిస్తున్నారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Follow us on

దేశంలో అశాంతిని సృష్టించేందుకు విపక్షాలు రైతులను వినియోగించుకుంటున్నాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు . అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని,  ఈ కారణం వల్లే రైతుల ఆందోళనను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.  రైతులు కోరుతున్న కనీస మద్దతుధరపై వెనక్కి వెళ్లబోమని కేంద్రం పదే పదే హామీ ఇస్తున్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాయ్ బరేలీలో గురువారం జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన..అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతుంటే సహించలేనివారే ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కావాలని ప్రతిపక్షాలు కోరుకోవడంలేదని ఆయన విమర్శించారు.

అన్నదాతల ప్రయోజనాలకోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని, వారి మేలుకోసమే రైతు చట్టాలు తెచ్చారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇందుకు ఆయనను ప్రశంసించాల్సింది పోయి ఆరోపణలు చేయడమేమిటన్నారు. తమ రాష్ట్రంలో రైతులు ఈ చట్టాలను స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు.