ఐరాసలో చైనాను ఏకాకిని చేసిన అమెరికా, బ్రిటన్, జర్మనీ

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 7:00 PM

చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉఘర్ ముస్లిం మైనారిటీల అణచివేత అమానుషమని అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలిలో...

ఐరాసలో చైనాను ఏకాకిని చేసిన అమెరికా, బ్రిటన్, జర్మనీ
Follow us on

చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉఘర్ ముస్లిం మైనారిటీల అణచివేత అమానుషమని అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలిలో ఆ దేశాన్ని పూర్తి ఏకాకిని చేశాయి. రాజకీయ అసంతృప్తిని అణచివేస్తున్నామన్న సాకుతో కౌంటర్ టెర్రరిజానికి పాల్పడవద్దని డ్రాగన్ కంట్రీని కోరాయి. ఆ రాష్ట్రంలో పదిలక్షల మందికి పైగా ఉఘర్ లను, ఇతర మైనారిటీలను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఐరాసలో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ అన్నారు. కెల్లీ వాదనతో బ్రిటన్, జర్మనీ దేశాల ప్రతినిధులు కూడా ఏకిభవించారు. ఇప్పటికే చైనా పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధ శిబిరాలకు తరలించింది. దీనిపై ఐరాస భద్రతా మండలి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.