‘మేడిన్ ఇండియా’ సైకిల్ తొక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Pardhasaradhi Peri

Jul 30, 2020 | 10:49 AM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 'మేడిన్ ఇండియాహీరో' సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోవిడ్-19 ని ఎదుర్కొనేందుకు స్థూల కాయానికి (ఒబెసిటీ) కి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రోగ్రాం లో..

మేడిన్ ఇండియా సైకిల్ తొక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియాహీరో’ సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోవిడ్-19 ని ఎదుర్కొనేందుకు స్థూల కాయానికి (ఒబెసిటీ) కి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రోగ్రాం లో భాగంగా ఆయన సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ జాన్సన్ కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చాలామంచిదని ఆయన అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూల కాయులేనని, మితి మీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని బ్రిటన్ లో కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దీంతో మెల్లగా ఒబెసిటీ వ్యతిరేక ప్రచారోద్యమం ప్రారంభమైంది . సైక్లింగ్, వాకింగ్ వంటివాటివల్ల కరోనాను ఎదుర్కోవచ్ఛునని ఈ వ్యాధి నుంచి బయటపడిన బోరిస్ జాన్సన్ అంటున్నారు. బ్రిటన్ లో హీరో మోటార్స్ కంపెనీ సైకిళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే అవి దేశ ప్రజలకు అనువైన, వారు కోరుతున్న డిజైన్లతో తయారవుతున్నాయి.