‘అవును ! 9 మందిని చంపా’! జపాన్ ‘ట్విటర్ కిల్లర్’

| Edited By: Pardhasaradhi Peri

Oct 01, 2020 | 6:15 PM

జపాన్ లో ఓ విచిత్రమైన హంతకుడు పతాకవార్తలకెక్కాడు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైనవారిని మభ్యపెట్టి 9 మందిని ఇతడు హతమార్చాడు. ఈ పని చేసింది నిజమేనని కోర్టులో ఒప్పుకున్నాడు. తకహిరో షిరైషీ అనే 29 ఏళ్ళ ఈ మర్డరర్..

అవును ! 9 మందిని చంపా! జపాన్ ట్విటర్ కిల్లర్
Follow us on

జపాన్ లో ఓ విచిత్రమైన హంతకుడు పతాకవార్తలకెక్కాడు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైనవారిని మభ్యపెట్టి 9 మందిని ఇతడు హతమార్చాడు. ఈ పని చేసింది నిజమేనని కోర్టులో ఒప్పుకున్నాడు. తకహిరో షిరైషీ అనే 29 ఏళ్ళ ఈ మర్డరర్..తరఫు లాయర్లు మాత్రం తమ  క్లయింటుపై అభియోగాల తీవ్రతను తగ్గించాలని, ఇతని చేతిలో మరణించినవారందరికీ ..  సూసైడ్ థాట్స్ (ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన) ఉండేదని, అందువల్ల వారి అంగీకారంతోనే హత్యాకాండకు దిగాడని కోర్టులో వాదించారు. తకహిరో తను చంపినవారి డెడ్ బాడీలను ముక్కలుగా కోసి కూల్ బాక్స్ ల్లో భద్రపరిచేవాడట. ట్విటర్ ద్వారా పలువురితో స్నేహం పెంచుకోవడం, వారికి సాయం చేస్తాననడం, అవసరమైతే తానూ మీతో బాటే మరణినిస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని దారుణంగా చంపడం ఇతని నైజమట. ఎక్కువగా 15 నుంచి 26 ఏళ్ళ మధ్య వయస్సువారిని తకహిరో తన టార్గెట్లుగా ఎంచుకునేవాడని తెలిసింది. 23 ఏళ్ళ మహిళ మిస్సింగ్ కేసులో మూడేళ్ళ క్రితం ఇతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తన సోదరి కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక ఆమె ట్విటర్ ఖాతాను సెర్చ్ చేయడంతో అసలు విషయం అతనికి తెలిసింది. మొత్తానికి జపాన్ లో ఈ ట్విటర్ కిల్లర్ మరో రకంగా పాపులర్ అయ్యాడు.