ట్యుటికోరన్ కస్టోడియల్ డెత్స్ కేసు సీబీఐకి.. తమిళనాడు సీఎం పళనిస్వామి

| Edited By: Pardhasaradhi Peri

Jun 28, 2020 | 7:06 PM

ట్యుటీకోరన్ కస్టోడియల్ మరణాల కేసును సీబీఐకి బదిలీ చేసేందుకు అనుమతించాలంటూ తాము మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ని కోరుతామని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసును.

ట్యుటికోరన్ కస్టోడియల్ డెత్స్ కేసు సీబీఐకి.. తమిళనాడు సీఎం పళనిస్వామి
Follow us on

ట్యుటీకోరన్ కస్టోడియల్ మరణాల కేసును సీబీఐకి బదిలీ చేసేందుకు అనుమతించాలంటూ తాము మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ని కోరుతామని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసును మదురై బెంచ్ విచారిస్తోంది. ట్యుటికోరన్ లో తండ్రీ కొడుకులైన జయరాజ్, ఫెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన విషయం విదితమే. ఈ నెల 30 న ఈ కేసులో మదురై బెంచ్ విచారణ జరుపుతుందని, ఆ సందర్భంగా తాము ఈ మేరకు కోర్టును కోరుతామని పళనిస్వామి చెప్పారు. న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేస్తామన్నారు. కోర్టు ఆమోదం తెలిపిన అనంతరం ఈ కేసు సీబీఐకి బదిలీ అవుతుందన్నారు. కాగా కోవిల్ పట్టి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడి సబ్ జైలును సందర్శించి ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, సీసీటీవీ రికార్డింగులను అందజేయాలని మదురై బెంచ్.. ఆదేశించింది. ఆయన రేపు వీటిని కోర్టుకు సమర్పించనున్నారు.