ఇలా చేస్తే…మీరు కూడా శ్రీవారి సేవలో వీఐపీలే !

|

Nov 05, 2019 | 6:17 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త వినిపించింది. స్వామివారిని శీఘ్రగతిని దర్శించుకునేందుకు సరికొత్త ఆన్ లైన్ పథకాన్ని టిటిడి ప్రవేశ పెట్టింది..శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఇచ్చే భక్తుల  కోసం  ప్రవేశపెట్టిన ఆ పథకం  ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు ఇవ్వొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కు కనీసం రూ.10వేలు విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ అధికారులు ఒక ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం […]

ఇలా చేస్తే...మీరు కూడా శ్రీవారి సేవలో వీఐపీలే !
Follow us on

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త వినిపించింది. స్వామివారిని శీఘ్రగతిని దర్శించుకునేందుకు సరికొత్త ఆన్ లైన్ పథకాన్ని టిటిడి ప్రవేశ పెట్టింది..శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఇచ్చే భక్తుల  కోసం  ప్రవేశపెట్టిన ఆ పథకం  ఆన్ లైన్ సేవలనూ లాంచ్ చేశారు. ఇకపై ఆన్ లైన్ లోనూ ట్రస్టుకి డొనేషన్లు ఇవ్వొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కు కనీసం రూ.10వేలు విరాళం ఇచ్చిన దాతలకు టీటీడీ అధికారులు ఒక ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తారు. టికెట్ నమోదు చేసుకున్న సమయం నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ కోటాలో ప్రతి రోజూ 500 టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు. శుక్రవారం మాత్రం కేవలం 200 టికెట్లు మాత్రమే కేటాయిస్తామన్నారు. విరాళం ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ పరిధిలో పరిగణిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విరాళంగా ఇచ్చే రూ. 10వేలతోపాటు టికెట్‌ను రూ.500తో కొనుగోలు చేయాల్సి ఉంటుందని టీటీడీ అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.