‘కిమ్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నా’…కాన్యేవెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2020 | 5:51 PM

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ పూర్తిగా తన పర్సనల్ సమస్యల్లో పడిపోయి, తన సంసారాన్ని రచ్చకీడుస్తున్నాడు. తన భార్య కిమ్ కర్దాషియన్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. తన తోటి ర్యాపర్ అయిన మీక్ మిల్ ని..

కిమ్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నా...కాన్యేవెస్ట్
Follow us on

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ పూర్తిగా తన పర్సనల్ సమస్యల్లో పడిపోయి, తన సంసారాన్ని రచ్చకీడుస్తున్నాడు. తన భార్య కిమ్ కర్దాషియన్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. తన తోటి ర్యాపర్ అయిన మీక్ మిల్ ని ఆమె ఓ హోటల్లో కలుసుకుందని ఆరోపించాడు. ఆమె తన పరిధిని మించిపోయిందని, తనను తాను ‘సుపీరియర్’ గా ఊహించుకుంటోందని ట్వీట్ చేశాడు. కిమ్ తల్లి క్రిస్ జెనర్ కూడా తన పట్ల ద్వేషభావాన్ని చూపుతోందని ఆరోపించిన కాన్యే వెస్ట్.. ఆమెను ‘క్రిస్ జొంగ్ ఉన్ ‘ గా అభివర్ణించాడు. ఆ తల్లీ కూతుళ్లిద్దరూ ‘వైట్ సుప్రిమెసీ’ (శ్వేత జాత్యహంకారం) తో మిడిసిపడుతున్నారని అన్నాడు. కాన్యే వెస్ట్, కిమ్ ఇప్పటికే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల  రేసులో నిలబడతానని ప్రకటించినప్పటినుంచీ కిమ్, క్రిస్ జెనర్ తనను ఆసుపత్రి పాల్జేసేందుకు ఇద్దరు డాక్టర్లతో అమెరికా నుంచి బయల్దేరబోయారని కాన్యే పేర్కొన్నాడు. గత రాత్రి ఇంకా కొన్ని ట్వీట్లు చేసి వాటిని తొలగించాడు.

కాగా కాన్యే వెస్ట్ మెంటల్ హెల్త్ పై అప్పుడే అమెరికాలో ఊహాగానాలు బయలుదేరాయి. గతంలో ఎన్నడూ అతడు ఇలా ప్రవర్తించిన సందర్భాలు లేవు. ర్యాపర్ గా మంచి పేరున్న కాన్యే.. ఎందుకిలా తయారయ్యాడో ఎవరికీ అంతుబట్టడంలేదు.