ఇంత జరిగినా ట్రంప్ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.’…జాన్ బోల్టన్ .’

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2020 | 3:40 PM

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ దళాలను హతమార్చేందుకు తాలిబన్లకు రష్యా 'ధన సహాయం' చేసే యోచనలో ఉందంటూ వఛ్చిన వార్తలపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ జాతీయ భద్రతా సలహాదారు..

ఇంత జరిగినా ట్రంప్ స్పందించకపోవడం ఆశ్చర్యకరం....జాన్ బోల్టన్  .
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ దళాలను హతమార్చేందుకు తాలిబన్లకు రష్యా ‘ధన సహాయం’ చేసే యోచనలో ఉందంటూ వఛ్చిన వార్తలపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు. ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని న్యూయార్క్ టైమ్స్  తెలిపింది. పైగా దీన్ని ఈ వర్గాలు ట్రంప్ కి తెలిపాయని కూడా పేర్కొంది. అయితే ఆ విషయమే తనకు తెలియదని ట్రంప్ చెప్పడం.. ఆఫ్ఘనిస్తాన్ లోని అమెరికన్ సైనికుల భద్రత పట్ల ఆయనకున్న నిర్లక్ష్యమే అని బోల్టన్ ఆరోపించారు. ఇంతేకాదు..ఈ సమాచారాన్ని తనకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గానీ, ఉన్నత సైనికాధికారి మార్క్ మెడోస్ గానీ చెప్పలేదని ట్రంప్ ట్వీట్లు చేయడాన్ని కూడా ఆయన గర్హించారు. ఇంటెలిజెన్స్ వార్తల్లోని వాస్తవాలను నమ్మడానికి ట్రంప్ సిధ్ధంగా లేరన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ అంశాన్ని కమాండర్-ఇన్-చీఫ్ కి తెలియజేసిన విషయం కూడా ఆయనకు తెలియదా అన్నారు. ఎవరూ తనకు సమాచారం చెప్పలేదని అనడం ద్వారా ఈ అధ్యక్షులవారు బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నారు అని జాన్ బోల్టన్ ఆరోపించారు. అటు న్యూయార్క్ టైమ్స్ లో వఛ్చిన వార్తలను ట్రంప్ ఫేక్ అని కొట్టివేయగా.. అమెరికా లోని రష్యన్ ఎంబసీ, మరోవైపు తాలిబన్లు కూడా ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొనడం విశేషం.