ట్రంప్ ను కామెడీగా మార్చిన బ్యూటీ మాట

|

Sep 15, 2020 | 4:15 PM

'అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా' అన్నట్టయింది టోమి లాహ్రెన్ మాట. నవంబర్ లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా..

ట్రంప్ ను కామెడీగా మార్చిన బ్యూటీ మాట
Follow us on

‘అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అన్నట్టయింది టోమి లాహ్రెన్ మాట. నవంబర్ లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌ద్ద‌తుగా అమెరికన్ కన్జర్వేటివ్ పొలిటికల్ కామెంటేటర్.. మాజీ టెలివిజన్ హోస్ట్ అయిన టోమి లాహ్రెన్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాస్త క్రియేటివిటీని రంగరించి ఆమె ట్రంప్ మీద చేసిన వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కార‌ణ‌మ‌య్యాయి. భార‌తీయ మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశిస్తూ టోమి చేసిన ప్ర‌సంగంలో ఈ మాట దొర్లింది. ‘ట్రంప్‌ను మ‌ళ్లీ అధ్య‌క్షుడిగా ఎన్నుకుంటే అమెరికా మరోసారి ప్ర‌గ‌తిప‌థంలోకి వెళ్తుంది. ఇప్ప‌టిదాకా మ‌ద్ద‌తుగా నిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఉల్లు(గుడ్ల‌గూబ‌) లాగే ట్రంప్ చాలా తెలివైన వారు’ అంటూ టోమి తప్పులోకాలేసింది. హిందీలో ఉల్లు అంటే మూర్ఖుడు అని అర్థం. అంతే.. నెటిజనం నెట్టింట్లో టోమిని ఓ ఆటాడుకుంటున్నారు.