‘పుతిన్ అలా అన్నారా ? అయితే మేం రాం’, ట్రంప్ తిరస్కృతి

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 4:38 PM

గల్ఫ్ లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసేందుకు ఐరాస భద్రతా మండలి ఇరాన్ అంశంపై శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్) నిర్వహించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సూచనను..

పుతిన్ అలా అన్నారా ? అయితే మేం రాం, ట్రంప్  తిరస్కృతి
Follow us on

గల్ఫ్ లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసేందుకు ఐరాస భద్రతా మండలి ఇరాన్ అంశంపై శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్) నిర్వహించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సూచనను అమెరికా అధినేత ట్రంప్ తప్పు పట్టారు. ఈ సమ్మిట్ కి తాము హాజరు కాబోమని, తమ దేశ ఎన్నికలు  అయ్యాక ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమ్మిట్ లో చైనా, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ దేశాలు పాల్గొనాలని పుతిన్ కోరారు. తమ మిత్ర దేశమైన ఇరాన్ అనవసరమైన ఆరోపణలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ఇరాన్ పై అత్యవసరంగా చర్చించాల్సిందే అని కోరారు. అయితే అసలే ఇరాన్ అంటే మండిపడుతున్న ట్రంప్ ఇందుకు అంగీకరించలేదు.

ఇరాన్ పై ఆయుధ ఆంక్షలను పొడిగిస్తూ అమెరికా చేసిన తీర్మానాన్ని ఐరాస భద్రతామండలి తోసిపుచ్చింది. ఇందుకు కూడా ట్రంప్ ఈ మండలి మీద గుర్రుగా ఉన్నారు.