మోదీ నన్ను ఆకాశానికెత్తేశారు, డోనాల్డ్ ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2020 | 11:22 AM

కరోనా వైరస్ ను అదుపు చేయడంలో భారత ప్రధాని మోదీ తనను ప్రశంసలతో ముంచెత్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మా (ఇండియా) దేశంలో కన్నా మీ దేశంలో కరోనా వైరస్ టెస్టులు..

మోదీ నన్ను ఆకాశానికెత్తేశారు, డోనాల్డ్ ట్రంప్
Follow us on

కరోనా వైరస్ ను అదుపు చేయడంలో భారత ప్రధాని మోదీ తనను ప్రశంసలతో ముంచెత్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మా (ఇండియా) దేశంలో కన్నా మీ దేశంలో కరోనా వైరస్ టెస్టులు ఎక్కువగా చేశారని ఆయన తనను పొగిడారని ట్రంప్ తనను తాను పొగుడుకున్నారు. ఇండియా కన్నా తామే అత్యధికంగా కరోనా వైరస్ టెస్టులు..44 మిలియన్ టెస్టులు చేశామని ఆయన చెప్పారు. ఇండియా చాలా ఎక్కువగా జనాభా ఉన్న దేశం కదా, అందువల్ల ఎక్కువ టెస్టులు చేయలేకపోతోంది అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మోదీ తనకు ఫోన్ చేసి, ‘వాటే జాబ్ యు హావ్ డన్ విత్ టెస్టింగ్’ అని ఒకటే పొగడడం విశేషమన్నారు. నెవాడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్… రానున్న తమ దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్లను చేజిక్కించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. అవసరమైనప్పుడల్లా ఇండియాను, మోదీని ఆకాశానికెత్తేస్తున్నారు.