TRS Party: పెద్దాయనా? చిన్న బాసా? గులాబీ దళంలో కొత్త చర్చ

|

Feb 25, 2020 | 5:50 PM

టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొత్త సందేహం మొదలైంది. సహకార ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గులాబీ దళంలో ఈ కొత్త చర్చ మొదలైంది. దానికి కారణాలు కూడా బాగానే చెబుతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు

TRS Party: పెద్దాయనా? చిన్న బాసా? గులాబీ దళంలో కొత్త చర్చ
Follow us on

New discussion started in TRS party: కేసిఆర్ మార్క్? కేటిఆర్ మార్క్ ? డీసీసీబీల్లో ఎవరి మార్క్‌ ఉండబోతోంది. ఇప్పుడు ఇదే టెన్షన్‌ గులాబీ నేతల్లో పెరిగిపోతోంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు సీటు వస్తుందా? రాదా? అని వెయిట్‌ చేస్తున్నారు.

డీసీసీబీ బ్యాంకుల ఛైర్మన్‌ల ఎంపిక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో హ‌ట్ టాపిక్‌గా మారింది.. అభ్యర్ధుల ఎంపిక‌లో పెద్దాయన మార్క్ ఉంటుందా.. ? లేదా చిన్న బాస్ మార్క్ ఉంటుందా అని నేతలకు టెన్షన్‌ ప‌ట్టుకుంది. పెద్దాయన కేసిఆర్ మార్క్ ఉంటే అభ్యర్థుల ఎంపిక ఒకలా… .కేటీఆర్ మార్క్ ఉంటే ఒక‌లా ఉంటుంది అనేది టిఆర్ఎస్ నేత‌ల అభిప్రాయం. ఆశావహులు మాత్రం ఎవరి గుడ్‌లుక్స్‌లో పడాలన్న మీమాంసలో పడిపోయారని పార్టీలో చెప్పుకుంటున్నారు.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్క్ ఉంటే దాదాపుగా యూత్‌కు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయని గులాబీ నేతలు అనుకుంటున్నారు. పెద్దాయన కేసిఆర్ న‌జ‌ర్ ఉంటే మాత్రం సీనియర్స్‌కు ఎక్కువ చాన్స్ ఉంటుంది అని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది..పూర్తిగా కేటిఆర్ మార్క్ ఉంటే మాత్రం త‌మ‌కు అవ‌కాశాలు త‌క్కువే అనే ఆందోళ‌న‌లో సీనియర్‌ నాయకులు ఉన్నారు. కేటీఆర్‌ యూత్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారని వారి నమ్మకం. అయితే వ్యవసాయ స‌హ‌కార సంఘాలు కావ‌డంతో పెద్దాయ‌న కేసిఆర్ ఫోక‌స్ పెట్టినట్లు తెలుస్తోంది.

డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్‌ల ఎంపిక కోసం సీనియ‌ర్లతో పాటు జూనియ‌ర్లు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారట. దీంతో అభ్యర్థుల ఎంపిక గులాబీ బాస్ కేసీఆర్‌ చెంతకు చేరిందట. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ కసరత్తు పూర్తి చేశారట. తొమ్మిది జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోని ఒక లిస్ట్‌ రెడీ చేశారట. చాలా చోట్ల సొంత పార్టీలోనే రెండు గ్రూపులు ఏర్పడి ….తమ మ‌నిషికి అంటే త‌మ మ‌నిషికి చాన్స్ ఇవ్వాలని అని జోరుగా ఫైర‌వీలు చేస్తున్నారట.

నిజామాబాద్ లాంటి జిల్లాలో స్పీక‌ర్ పోచారం త‌న త‌న‌యుడి కోసం ప్రయ‌త్నాలు చేస్తుంటే…అదే జిల్లా నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడ త‌న బంధువు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారట. అటూ వ‌రంగ‌ల్‌తో పాటు మెద‌క్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న‌ల్గొండ‌ జిల్లాల్లో కూడ మంత్రులు వ‌ర్సెస్‌ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మధ్య పోరు నడుస్తోందట. అయితే ఈ సారి డీసీసీబీల్లో సీనియర్లతో పాటు యూత్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ మార్క్‌ కూడా కనిపించే అవకాశం ఉంది.

Read this: Gangster Nayeem family shocks IT officials ఐటీ అధికారులకు నయీం ఫ్యామిలీ షాక్