‘కాక’ రేపిన ఫిన్లాండ్ ప్రధాని డ్రెస్, ట్రోలింగ్ షురూ !

| Edited By: Anil kumar poka

Oct 17, 2020 | 5:51 PM

ఫిన్లాండ్ ప్రధాని 34 ఏళ్ళ సనా మారిన్ ధరించిన డ్రెస్ వివాదాస్పదమైంది. లో-కట్ నల్లని బ్లేజర్ ధరించిన ఈమె.. ఇటీవల 'ట్రెండీ' అనే ఫ్యాషన్ మేగజైన్ కి ఫోటో షూట్ ఇచ్చింది. అంతే ! ఇక ట్రోలింగ్ మొదలైంది.

కాక రేపిన ఫిన్లాండ్ ప్రధాని డ్రెస్, ట్రోలింగ్ షురూ !
Follow us on

ఫిన్లాండ్ ప్రధాని 34 ఏళ్ళ సనా మారిన్ ధరించిన డ్రెస్ వివాదాస్పదమైంది. లో-కట్ నల్లని బ్లేజర్ ధరించిన ఈమె.. ఇటీవల ‘ట్రెండీ’ అనే ఫ్యాషన్ మేగజైన్ కి ఫోటో షూట్ ఇచ్చింది. అంతే ! ఇక ట్రోలింగ్ మొదలైంది. ప్రధాని వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి డ్రెస్సులు ధరించరాదంటూ నెట్ లో విమర్శలు మొదలయ్యాయి. మీ తీరు ప్రజలకు మీ పట్ల ఉన్న విశ్వసనీయతను కోల్పోయేలా చేస్తుందని ఒకరంటే.. అసలు ఆమె ప్రధాన మంత్రా లేక మోడలా అని మరొకరు ఘాటుగా ట్రోల్ చేశారు. అయితే చాలామంది మహిళలు సనాకు మద్దతు పలికారు. లో-కట్ బ్లేజర్ ధరించిన పలువురు మహిళల ఫోటోలను వారు షేర్ చేశారు.

ప్రపంచంలోని ప్రధాన మంత్రుల్లో అత్యంత చిన్న వయస్కురాలైన సనా మారిన్..గత ఏడాది డిసెంబరులో  ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు పార్టీల కూటమికి ఆమె నేతృత్వం వహిస్తున్నారు.