మా రాష్ట్ర గవర్నర్ ను తొలగించండి, రాష్ట్రపతికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల లేఖ, బీజేపీ పక్షపాతిగా మారారని విమర్శా

| Edited By: Anil kumar poka

Dec 30, 2020 | 7:55 PM

తమ రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ను తొలగించాలని కోరుతూ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు.

మా రాష్ట్ర గవర్నర్ ను తొలగించండి, రాష్ట్రపతికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల లేఖ, బీజేపీ పక్షపాతిగా మారారని విమర్శా
Follow us on

తమ రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ను తొలగించాలని కోరుతూ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. రాజ్యాంగ నియమావళిని ఆయన అతిక్రమించారని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, బీజేపీకి అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని వీరు విమర్శించారు. ఈ లేఖపై ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓబ్రీన్, కళ్యాణ్ బెనర్జీ, సుఖేందు శేఖర్ రాయ్, కాకోలీ ఘోష్ దస్తీదార్ సంతకాలు చేశారు. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, రాజకీయ కక్ష చూపుతున్నారని ఈ ఎంపీలు ఆరోపించారు. ఓ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అయిన ఈయన..ఒక రాజకీయ పార్టీకి బాహాటంగా మద్దతునిస్తున్నారని, ఎలెక్షన్ కమిషన్, సిఏజీ వంటి సంస్థలపై పెత్తనం వహించజూస్తున్నారని వీరు పేర్కొన్నారు. ఇంకా శాసన సభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెడుతున్నారని స్పీకర్ ను సంజాయిషీలు కోరుతున్నారని అన్నారు. లోగడ బీజేపీ అధ్యక్షుని కాన్వాయ్ పై జరిగిన దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి అపాలజీ చెప్పాలని గవర్నర్  కోరారని ఈ ఎంపీలు ఆరోపించారు.

అయితే ఈ లేఖను బీజేపీ నేతలు తేలిగ్గా కొట్టి పారేశారు. రాష్ట్రపతికి దీన్ని పంపినా దీని ప్రభావం ఏమీ ఉండదని ఈ పార్టీ నేత కైలాష్ విజయ్ వర్గీయ అన్నారు. గవర్నర్ ను చూసి తృణమూల్ కాంగ్రెస్ భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజ్యాంగబధ్ధంగానే నడుచుకుంటున్నారని ఆయన చెప్పారు.