వీల్‌చైర్‌ బార్బీడాల్‌

| Edited By:

Aug 28, 2019 | 1:49 PM

బార్బీ డాల్‌ పేరు తెలియనివారుండరు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే బొమ్మ ఇది. సోషల్‌ మీడియాలో ఇప్పుడో బార్బీ హల్‌చల్‌ చేసింది. ఎప్పటి లాగే రంగు రంగుల డ్రెస్‌ వేసుకుంది.. కాకపోతే కాస్త భిన్నంగా వీల్‌ఛైర్‌లో కూర్చుంది ఈ బార్బీడాల్‌..  లోర్నా అనే మహిళ తాను వీల్‌చైర్‌ బార్బీ డాల్‌ను కొనుగోలు చేశానంటూ పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్శించడమే కాదు, ఆలోచింపజేసింది. అంగవైకల్యంతో బాధపడుతున్నలోర్నా..తాను పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా తెలిపారు. అంగవైకల్యం […]

వీల్‌చైర్‌ బార్బీడాల్‌
Follow us on

బార్బీ డాల్‌ పేరు తెలియనివారుండరు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడే బొమ్మ ఇది. సోషల్‌ మీడియాలో ఇప్పుడో బార్బీ హల్‌చల్‌ చేసింది. ఎప్పటి లాగే రంగు రంగుల డ్రెస్‌ వేసుకుంది.. కాకపోతే కాస్త భిన్నంగా వీల్‌ఛైర్‌లో
కూర్చుంది ఈ బార్బీడాల్‌..  లోర్నా అనే మహిళ తాను వీల్‌చైర్‌ బార్బీ డాల్‌ను కొనుగోలు చేశానంటూ పెట్టిన పోస్ట్‌ అందరి దృష్టినీ ఆకర్శించడమే కాదు, ఆలోచింపజేసింది. అంగవైకల్యంతో బాధపడుతున్నలోర్నా..తాను పడ్డ కష్టాలను
కళ్లకు కట్టినట్లుగా తెలిపారు. అంగవైకల్యం అనేది శరీరానికి తప్ప..మనసుకి కాదంటూ వివరించారు.

పిల్లల పుట్టిన రోజులకు, శుభకార్యాలకు ఈ బొమ్మలను బహుమతులుగా ఇస్తుంటారు పెద్దవారు. అంతేకాదు చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు కూడా వారిని ఊరడించడానికి ఈ బొమ్మలతోనే ఆటలాడిస్తారు తల్లులు. అటువంటి బార్బీ డాల్‌
ఇప్పుడు లోర్నాలాంటి వారికి సైతం మనో నిబ్బరాన్ని, ఆత్మస్తైర్యాన్ని కలిగిస్తోందంటూ సోషల్‌ మీడియాలో పలువురు కామెంట్ చేశారు.