రాజ్యసభలో రైతు బిల్లులు, చించివేసిన ప్రతిపక్షాలు

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2020 | 2:23 PM

రాజ్యసభలో ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు బిల్లులపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. విపక్షాల నినాదాలు, కేకలు, నిరసనల మధ్య ఈ బిల్లులపై మూజువాణీ ఓటుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో విపక్ష సభ్యులు..

రాజ్యసభలో రైతు బిల్లులు, చించివేసిన ప్రతిపక్షాలు
Follow us on

రాజ్యసభలో ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు బిల్లులపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. విపక్షాల నినాదాలు, కేకలు, నిరసనల మధ్య ఈ బిల్లులపై మూజువాణీ ఓటుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో విపక్ష సభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్లకార్డులతో వెల్ లోకి దూసుకుపోయారు. ఈ బిల్లులు పూర్తిగా రైతులకు వ్యతిరేకమంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్.. పరుగున వెళ్లి డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చైర్ వద్దే ఆ బిల్లులను చించి పోగులు పెట్టారు. వీటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ గందరగోళంతో సభను డిప్యూటీ చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు.

రాజ్యసభలో 86 మంది బీజేపీ సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి 40 మంది, టీఎంసీ నుంచి 13, సమాజ్ వాదీ పార్టీ నుంచి 8 మంది, టీ ఆర్ ఎస్ నుంచి 7, బీజేడీ 9, జేడీ-యూ నుంచి 5, అన్నా డీఎంకే నుంచి 9, ఆర్జేడీ నుంచి 5 గురు సభ్యులు ఉన్నారు.