ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణం. ప్రధాని మోదీ అభినందన..

| Edited By: Anil kumar poka

Mar 10, 2021 | 6:13 PM

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా  తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన ఒక్కరే ప్రమాణం చేయడం విశేషం.

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్ ప్రమాణం. ప్రధాని మోదీ అభినందన..
Follow us on

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా  తీరత్ సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం డెహ్రాడూన్ లో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన ఒక్కరే ప్రమాణం చేయడం విశేషం. కేబినెట్ మంత్రులు తరువాత ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  తీరత్ ప్రమాణం చేసిన వెంటనే ప్రధాని మోదీ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. తీరత్ విస్తృత పాలనా, సంస్థాగత అనుభవం కలిగినవారని, ఆయన నాయకత్వం కింద రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం తనకుందని మోదీ పేర్కొన్నారు. అటు హోం మంత్రి అమిత్ షా కూడా తీరత్ ను అభినందించారు. ప్రస్తుతం తీరత్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.  అటు-  త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయక ముందు, ఆ తరువాత కూడా … సీఎం రేసులో తీరత్ పేరు లేకపోయినా ఈయనను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు.

ఇక తనకు పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు తీరత్ సింగ్ పదేపదే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రతివారి సహాయ, సహకారాలతో తనకు అప్పగించిన నూతన బాధ్యతను సక్రమంగా నిర్వరిస్తానని  ఆయన చెప్పారు. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బిజేపీనుంచి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్ఛే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. త్రివేంద్ర సింగ్ రావత్ మాదిరే తీరత్ సింగ్ కూడా చాలా నెమ్మదస్తుడని, లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్ఛే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ఈయన  పార్టీని విజయావకాశాలకు దగ్గర చేస్తారో లేదో చూడాల్సి ఉందని అంటున్నారు. స్వతహాగా సౌమ్యుడైన ఈయన ఇక పార్టలో, తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలను అందర్నీ ఎలా కలుపుకుని పోతారో వేచి చూడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు భావిస్తున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :

పాలు పట్టుకొచ్చిన సంరక్షకులు… పరుగెత్తుకొచ్చిన ఏనుగులు… చూస్తుండగానే..

Rare Animal: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వింత జంతువు… ఈ వింత జంతువు ఏంటో మీరు గుర్తించగలరా…?