Donald Trump Supporters: ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపే విజేత, వాషింగ్టన్ లో వేలాది మద్దతుదారుల భారీ ప్రదర్శన, పోలీసులతో ఘర్షణ

| Edited By: Pardhasaradhi Peri

Nov 15, 2020 | 1:09 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయినప్పటికీ  ఓటమిని ఒప్పుకోవడానికి అయన నిరాకరిస్తుండగా.. ఆయన  మద్దతుదారులు కూడా అదే 'పాట' పాడుతున్నారు. ఈ ఎన్నికలు ఫ్రాడ్..

Donald Trump Supporters: ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపే విజేత, వాషింగ్టన్ లో వేలాది మద్దతుదారుల భారీ ప్రదర్శన, పోలీసులతో ఘర్షణ
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయినప్పటికీ  ఓటమిని ఒప్పుకోవడానికి అయన నిరాకరిస్తుండగా.. ఆయన  మద్దతుదారులు కూడా అదే ‘పాట’ పాడుతున్నారు. ఈ ఎన్నికలు ఫ్రాడ్ అంటూ ఆరోపిస్తున్నారు.  వాషింగ్టన్ లో శనివారం అనేకమంది  దేశ జాతీయ పతాకాలను చేతబట్టుకుని ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ  ర్యాలీలో పాల్గొన్నారు. వైట్ హౌస్ వద్ద పెన్సిల్వేనియా ఎవెన్యూ నుంచి ఫ్రీడమ్ ప్లాజా వరకు వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. వీరిని అదుపు చేసేందుకు ఫెడరల్ దళాలు, పోలీసులు ప్రయత్నించగా పలువురు వారితో ఘర్షణకు దిగారు. మరోవైపు ఫ్లోరిడాలోనూ వందలాది మంది ట్రంప్ అనుకూలురు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రతి ఓటునూ లెక్కించండి’, ‘మార్కిస్ట్ ప్రభుత్వ అధికారం కింద నివసించలేం’ అంటూ నినాదాలు చేశారు. మరికొంతమంది ‘యూఎస్ఏ’, ‘యూఎస్ఏ ‘, ‘ఫోర్ మోర్ ఇయర్స్’ అని కేకలు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ తరచూ తన ప్రసంగాల్లో ఇవే పదాలు వాడుతుంటారు. ఈ ఎన్నికలను తాము విశ్వసించలేమని  ఆయన మద్దతుదారులు ఇప్పటికీ ఘంటాపథంగా చెబుతున్నారు.