హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రిక్తత.. నిప్పుఅంటుకొని పోలీసు అధికారికి తీవ్రగాయాలు

|

Dec 24, 2020 | 9:04 PM

హైదరాబాద్ లో అక్రమకట్టడాలను కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం..

హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రిక్తత.. నిప్పుఅంటుకొని పోలీసు అధికారికి తీవ్రగాయాలు
Follow us on

హైదరాబాద్ లో అక్రమకట్టడాలను కూల్చివేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. కోర్టులో కేసు ఉండగా ఇళ్లను ఎలా కూల్చుతారంటుూ రెవెన్యూ అధికారులను స్థానికులు నిలదీశారు. అదే సమయంలో పూనమ్ చాంద్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు. దాంతో  సీఐ బిక్షపతి రావు తలుపు కొట్టి అతడిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసాడు. అదే సమయంలో ఇంటి తలుపుకు పూనమ్ చాంద్  కిరోసిన్ పోసుకొని నిప్పంటించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సీఐ బిక్షపతి రావుకు ఆ మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సీఐ  కాళ్ళు చేతులకు గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. మరో వైపు మేయర్‌ ఇంటి దగ్గరున్న అక్రమషెడ్డు కూల్చి ఆ తర్వాత పేదల ఇళ్ల వద్దకు రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు.