గొప్ప నిర్ణ‌యం… పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5వేల‌ సాయం

|

Jun 07, 2020 | 1:10 PM

తెలంగాణ వక్ఫ్‌బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల సాయం అందించాలని నిర్ణయించింది.

గొప్ప నిర్ణ‌యం... పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5వేల‌ సాయం
Follow us on

తెలంగాణ వక్ఫ్‌బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల సాయం అందించాలని నిర్ణయించింది. చైర్మన్‌ మహమ్మద్‌ సలీం అధ్యక్షతన శనివారం జ‌రిగిన బోర్డు మీటింగులో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం 49 అంశాలపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

కాగా గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్‌ 81లో ఓ ముస్లిం డెడ్ బాడీకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించికుండా అడ్డుకున్న వీఆర్‌ఏ, తాసిల్దార్ ఆఫీసు స్టాఫ్ పై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలని కలెక్టర్‌ను వక్ఫ్‌బోర్డు కోరింది. ఈ నేప‌థ్యంలో శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపింది. ఈ మీటింగులో బోర్డు సభ్యులు అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేన్‌, జాకీర్‌ హుస్సేన్‌, మిర్జా అన్వర్‌బేగ్‌, జావిద్‌ పాల్గొన్నారు.