ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ, రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు, సాగునీటి అంశాల విషయమై చర్చ

|

Dec 12, 2020 | 7:34 PM

హస్తినలో బిజీ బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమమ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు,..

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ, రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు, సాగునీటి అంశాల విషయమై చర్చ
Follow us on

హస్తినలో బిజీ బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు, సాగునీటి అంశాల విషయమై ప్రధానమంత్రితో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం, తొలుత కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్ ను, తర్వాత అమిత్ షాను కలిశారు. ఈ ఉదయం విమానయాన శాఖ మంత్రి ని కలిసిన సీఎం.. ఈ సాయంత్రం ప్రధానితో భేటీ అయ్యారు.  అంతకుముందు, కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌తో సమావేశమైన కేసీఆర్,  గృహాల మంజూరు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరారు. వాటిలో పెద్దపల్లిజిల్లా బసంత్‌నగర్‌, వరంగల్‌లోని మామునూర్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌జిల్లా గుడిబండ, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వీటిలో భద్రాద్రి మినహా మిగతా ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్దికి భూమి గుర్తించి…కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు  కేసీఆర్‌, కేంద్రమంత్రికి గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే కొత్త విమానాశ్రయాలపై ప్రధానిని కోరుతూ లేఖ రాసినట్లు కూడా సీఎం,  కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌కు కేసీఆర్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.