జనరల్ సులేమాన్ మృతికి ఇరాన్ సుప్రీం కమాండర్ కంట కన్నీరు

| Edited By: Anil kumar poka

Jan 07, 2020 | 1:54 PM

ఇరాన్ జనరల్ ఖాసిం  సులేమాన్ మృతికి ఇరాన్ దేశ ప్రజలంతా  బరువెక్కిన హృదయాలతో నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో సుమారు పదిలక్షలమందికి పైగా ఇరానియన్లు పాల్గొన్నారు. ఆయన మరణానికి కారకుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను వదలబోమని వారు ‘ ప్రతిజ్ఞ ‘ చేశారు. సులేమాన్ భౌతిక కాయం ఉన్న పేటికను భారీ భద్రతా బలగాల మధ్య క్వామ్ సిటీ మీదుగా తీసుకుపోతుండగా ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఓ వైపు […]

జనరల్ సులేమాన్ మృతికి ఇరాన్ సుప్రీం కమాండర్ కంట కన్నీరు
Follow us on

ఇరాన్ జనరల్ ఖాసిం  సులేమాన్ మృతికి ఇరాన్ దేశ ప్రజలంతా  బరువెక్కిన హృదయాలతో నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో సుమారు పదిలక్షలమందికి పైగా ఇరానియన్లు పాల్గొన్నారు. ఆయన మరణానికి కారకుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను వదలబోమని వారు ‘ ప్రతిజ్ఞ ‘ చేశారు. సులేమాన్ భౌతిక కాయం ఉన్న పేటికను భారీ భద్రతా బలగాల మధ్య క్వామ్ సిటీ మీదుగా తీసుకుపోతుండగా ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీ కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఓ వైపు ముస్లిం ప్రార్థనలు జరుగుతుండగా.. ఇరానియన్లు అమెరికా వ్యతిరేక నినాదాలు చేస్తుండగా.. ఖొమైనీ కంట తడిపెట్టారు. తనకు  అత్యంత ఆప్తుడైన సులేమాన్ తో దశాబ్దాల పాటు  సాగిన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సజీవ అమరుడిగా సులేమాన్ ను అభివర్ణించారు. సులేమాన్ అంత్య క్రియలు ఆయన సొంత ప్రాంతమైన కెర్మాన్ లో మంగళవారం జరగనున్నాయి. ఆయన కుమార్తె జీనాబ్.. తన తండ్రితో గల బంధాన్ని గుర్తు చేసుకుంటూనే..అమెరికాను, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దుమ్మెత్తిపోసింది.  అమెరికన్ సైనికుల కుటుంబాలు తమ పిల్లల మరణవార్తలు తెలుసుకుని క్షోభించే రోజు ఎంతో దూరంలో లేదని ఆమె వ్యాఖ్యానించింది. మరోవైపు.. అమెరికా ఇరాన్ పై తన యుధ్ధ సన్నాహాలకు రెడీ అవుతోంది.  వందల సంఖ్యలో గూఢఛార విమానాలను అమెరికా సరిహద్దుల్లో నిలిపిఉంచారు.