మిడతల దండ్లు వచ్ఛేశాయ్ ! ఢిల్లీ, హర్యానా హైఅలర్ట్ !

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 6:17 PM

లక్షలాది మిడతలు ఢిల్లీ, హర్యానా రాష్టాలను చేరాయి. శనివారం ఉదయం  వీటి కారణంగా ఆకాశమంతా మబ్బు పట్టినట్టు దాదాపు చీకటి ఆవరించింది. భవనాలు, ఇళ్ళు, చెట్లు ఎక్కడపడితే అక్కడ వీటి సమూహాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలో..

మిడతల దండ్లు వచ్ఛేశాయ్ ! ఢిల్లీ, హర్యానా హైఅలర్ట్ !
Follow us on

లక్షలాది మిడతలు ఢిల్లీ, హర్యానా రాష్టాలను చేరాయి. శనివారం ఉదయం  వీటి కారణంగా ఆకాశమంతా మబ్బు పట్టినట్టు దాదాపు చీకటి ఆవరించింది. భవనాలు, ఇళ్ళు, చెట్లు ఎక్కడపడితే అక్కడ వీటి సమూహాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలో ఇవి కనిపించడంతో విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. విమానాలను నడిపేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ ఢిల్లీవాసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మిడతల దండ్లను పారదోలేందుకు పెద్దగా డీజే సౌండ్లను పెట్టాలని, డ్రమ్స్ సౌండ్స్ ని పెంచాలని, టపాకాయలు పేల్చాలని, నిమ్మ చెట్ల ఆకులను కాల్చాలని.. ఇంకా ఇలాగే అటవీ శాఖకు ఎన్నో సూచనలు చేశారు.  ఇక సమీప జిల్లాల్లోని గ్రామాలవారిని కూడా అప్రమత్తం చేయాలన్నారు. అటు స్థానికుల్లో అనేకమంది తమ ఇళ్లపై చేరిన వీటిని ఫోటోలు, వీడియోలు తీస్తూ తమ ‘టైపు’ లో ఎంజాయ్  చేయడం విశేషం.