కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, ఈడీ ఆఫీసుకు మళ్ళీ మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్

| Edited By: Anil kumar poka

Oct 28, 2020 | 2:24 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి, సీఎం పినరయి విజయన్ కి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయిన ఎం. శివశంకర్ ను ఈడీ అధికారులు మళ్ళీ విచారించనున్నారు.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, ఈడీ ఆఫీసుకు మళ్ళీ మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి, సీఎం పినరయి విజయన్ కి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయిన ఎం. శివశంకర్ ను ఈడీ అధికారులు మళ్ళీ విచారించనున్నారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలును కేరళ హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను ఈడీ తిరిగి కొచ్చి లోని తమ కార్యాలయానికి తీసుకు వెళ్ళింది. ‘అస్వస్థత’ (?) పాలై తిరువనంతపురం ఆసుపత్రిలో చేరిన శివశంకర్ ను అధికారులు తమవెంటబెట్టుకుని వెళ్లారు. ఇప్పటికే  ఈయనను వారు పలుమార్లు విచారించారు. తనను మొత్తం 90 గంటలపాటు వారు ప్రశ్నించారని, కానీ తనకు వ్యతిరేకంగా ఎలాంటి రిపోర్టును సమర్పించలేదని శివశంకర్ అంటున్నారు. కాగా ఈయన అస్వస్థత అంతా బూటకమని, తన భార్య పని చేసే ఆసుపత్రిలోనే శివశంకర్ కావాలనే అడ్మిట్ అయ్యారని, ఆయన పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిలును అనుమతించవద్దని కస్టమ్స్ శాఖ కోర్టును కోరింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ శాఖ మూడూ  వరుసగా దర్యాప్తు చేస్తున్నాయి.