చికిత్స కోసం కేరళ జర్నలిస్టును ఢిల్లీ ఆసుపత్రికి తరలించండి, యూపీకి సుప్రీంకోర్టు ఆదేశం,

| Edited By: Phani CH

Apr 28, 2021 | 4:21 PM

మధుర జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ ని ఢిల్లీలోని ఎయిమ్స్, కి గానీ,  ప్రభుత్వ ఆసుపత్రికి గానీ తరలించాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చికిత్స కోసం కేరళ జర్నలిస్టును ఢిల్లీ ఆసుపత్రికి తరలించండి, యూపీకి సుప్రీంకోర్టు ఆదేశం,
Supreme Court Order On Jailed Kerala Journalist
Follow us on

మధుర జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ ని ఢిల్లీలోని ఎయిమ్స్, కి గానీ,  ప్రభుత్వ ఆసుపత్రికి గానీ తరలించాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  చికిత్స అనంతరం ఆయనను మళ్ళీ జైలుకు తరలించవచ్చునని పేర్కొంది.  కప్పన్ కి కోవిడ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, ఆసుపత్రి డాక్టర్లు  ఆయనను డిశ్చార్జ్ చేశారని యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే శరీరానికి గాయమైనందున ఆయనకు ట్రీట్ మెంట్  అవసరమని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ రిపోర్టులో తెలిపింది. కప్పన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ ని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ జర్నలిస్టుకు బీపీ, పల్స్ రేట్,  మధుమేహం ఉన్నాయని, అందువల్ల ఆయనకు చికిత్స అవసరమని ఈ బెంచ్ అభిప్రాయపడింది. కరోనావైరస్ కి గురైన తన భర్తను మధురలోని  ఆసుపత్రిలో మంచానికి కట్టివేశారని, కనీసం ఆయనను టాయిలెట్ కైనా అనుమతించలేదని కప్పన్ భార్య ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆరోపించారు.

యూపీలోని హత్రాస్ లో జరిగిన దళిత యువతి హత్యాచార ఘటనను కవర్ చేసేందుకు కప్పన్ గత ఏడాది అక్టోబరులో ఢిల్లీ నుంచి యూపీకి వెళ్తుండగా పోలీసులు  అరెస్టు చేశారు.ఆయనను దేశద్రోహిగా ప్రభుత్వం ఆరోపించింది. పీపుల్స్ ఫండ్ ఫర్ ఇండియా అనే నిషిద్ధ సంస్థకు ఈ  జర్నలిస్ట్ పనిచేస్తున్నాడని, ఇతనివి దేశ వ్యతిరేక కార్యక్రమాలని యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే కేరళ జర్నలిస్టుల సంఘ, సీఎం పినరయి విజయన్, 11  మంది ఎంపీలు కూడా ఆయనను విడుదల చేయాలంటూ యూపీ ప్రభుత్వానికి లేఖలు రాశారు.   లోగడ కప్పన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టులో ప్రభుత్వం వ్యతిరేకించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ ఆటగాడిని రోహిత్, పంత్ వారి జట్టు నుంచి తొలగించారు..! కానీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంది.. ఎందుకో తెలుసా..?

పాత కాయిన్స్‏కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే… ఎలాగో తెలుసా..