ఐసిస్ ఉగ్రవాది ఇంట్లో అన్నీ పేలుడు పదార్థాలే

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 11:38 AM

ఐసిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ఇంటి నుంచి పోలీసులు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబుల తయారీలో వినియోగించే బాల్ బేరింగులు, ఇతర పదార్థాలు వీటిలో..

ఐసిస్ ఉగ్రవాది ఇంట్లో అన్నీ పేలుడు పదార్థాలే
Follow us on

ఐసిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ఇంటి నుంచి పోలీసులు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబుల తయారీలో వినియోగించే బాల్ బేరింగులు, ఇతర పదార్థాలు వీటిలో ఉన్నాయి. అలాగే  ఆత్మాహుతి దళాలు నడుముకు కట్టుకునే సూసైడ్ వెస్ట్ ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అంటే తనను ఆత్మాహౌతి దళ సభ్యుడుగా కూడా అబూ యూసుఫ్ ఊహించుకున్నట్టు కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. యూపీలోని బలరాం పూర్ వాసి అయిన అబూ యూసుఫ్ ని ఢిల్లీలో నిన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇతని సహచరుల ఇళ్లలో కూడా వారు దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలోని జన సమ్మర్ధ ప్రదేశాల్లో బాంబులు పేల్చి  విధ్వంసం సృష్టించాలన్న ఇతని ప్లాన్ ని పోలీసులు వమ్ము చేశారు.