మన చర్మంపై కరోనా వైరస్‌ తొమ్మిది గంటలపాటు బతికే ఉంటుంది

|

Oct 10, 2020 | 9:13 AM

అన్‌లాక్‌లో ఆంక్షలన్నీ సడలించేశారుగా..! ఇక మనకేం భయం అని అనుకోకండి.. కరోనా వైరస్‌ మహా ప్రమాదకారి..! ఇట్టే వ్యాప్తి చెందుతుంది.. మన చర్మంపై ఆ కరోనా వైరస్‌ తొమ్మిది గంటల వరకు బతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది..

మన చర్మంపై కరోనా వైరస్‌ తొమ్మిది గంటలపాటు బతికే ఉంటుంది
Follow us on

అన్‌లాక్‌లో ఆంక్షలన్నీ సడలించేశారుగా..! ఇక మనకేం భయం అని అనుకోకండి.. కరోనా వైరస్‌ మహా ప్రమాదకారి..! ఇట్టే వ్యాప్తి చెందుతుంది.. మన చర్మంపై ఆ కరోనా వైరస్‌ తొమ్మిది గంటల వరకు బతికే ఉంటుందని తాజాగా వెల్లడైంది కాబట్టి ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిందంటున్నారు పరిశోధకులు. ఇన్‌ఫ్లూయెంజా ‘ఎ’ వైరస్‌ను మొదలు పెట్టుకుని అన్ని వైరస్‌లు ఎక్కువలో ఎక్కువ రెండు గంటలలో చనిపోతుంటే కరోనా వైరస్‌ అని మనం చెప్పుకుంటున్న సార్స్‌-సీవోవీ-2 మాత్రం తొమ్మిది గంటలపాటు జీవించి ఉంటుందని జపాన్‌ పరిశోధన సంస్థ తెలిపింది.. అంచేత ఇతరులకు ఈజీగా వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది.. మనకేం కాదన్న అతి విశ్వాసం పనికికాదని తెలిపింది.. అన్‌లాక్‌తో జనజీవనం మళ్లీ యథాతథస్థితికి వచ్చేసింది.. ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు.. అలాంటప్పుడు అప్రమత్తతతో మెలగాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని సలహా ఇచ్చింది.. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శానిటైజ్‌ చేసుకోవాలని తెలిపింది.. అప్పుడే వైరస్‌ వ్యాప్తిని తగ్గించగలుగుతామని పేర్కొంది. సాధారణ ఫ్లూ వైరస్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ మనుషుల చర్మంతో సహా వివిధ ఉపరితలాలపై చాలాసేపు చురుకుగా ఉంటున్నట్లు కనుగొన్నారు. అయితే స్టీలు, గాజు, ప్లాస్టిక్‌ వంటి వాటిపై ఆ వైరస్‌ త్వరగా నశిస్తోందన్నారు. జపాన్‌ క్యోటో పర్‌ఫెక్చురల్‌ వర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన తాజా పరిశోధన సారాంశం ఇది! ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త!!