అయోధ్యలో రాములోరి గుడి.. ముహూర్తం ఖరారు

| Edited By: Anil kumar poka

Feb 19, 2020 | 2:39 PM

అయోధ్యలో ఇక రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. శ్రీరామనవమి రోజయిన ఏప్రిల్ 2 నుంచి నిర్మాణం మొదలు కానుంది. రెండేళ్లలో నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా.

అయోధ్యలో రాములోరి గుడి.. ముహూర్తం ఖరారు
Follow us on

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే ముహూర్తం ఖరారయింది. ఏప్రిల్ 2.. శ్రీరామనవమి రోజునుంచి మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నిజానికి ఆ రోజున గానీ, ఏప్రిల్ 26 నుంచి గానీ గుడి నిర్మాణం ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, చివరకు శ్రీరామనవమినాడే మంచి ముహూర్తం ఉందని  శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ట్రస్టీ స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ 15 మంది సభ్యులతో ఇండిపెండెంట్  ట్రస్టును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ట్రస్టులో మోదీ కూడా సభ్యుడుగా ఉన్నారు. ఇప్పటికే కరసేవకులు వందలాదిగా అయోధ్య చేరుకుంటున్నారని, విరాళాలు వెల్లువెత్తుతున్నాయని ఆయన చెప్పారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి కావచ్ఛునని ఆయన పేర్కొన్నారు.ఏమైనా.. ముహూర్తం ఖరారైంది గనుక ఇక సన్నాహాలు మొదలు కానున్నాయి.