
భారత గణ తంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఈ స్పెషల్ టర్బన్ ని గుజరాత్ లోని జామ్ నగర్ కి చెందిన రాయల్ ఫ్యామిలీ గిఫ్ట్ గా ఇచ్చిందట.. ఈ కలర్ ఫుల్ తలపాగాను గుజరాతీలో ‘పగ్డీ’ గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను. ఆ తరువాత కూడా మోదీ ఈ తలపాగాను ధరించే ఉన్నారు. హలారీ పగ్డీగా ప్రచారంలో ఉన్న ఈ తలపాగాను జామ్ నగర్ రాయల్ ఫ్యామిలీ ప్రత్యేకంగా మోదీ కోసం రూపొందించింది. గత ఏడాది రిపబ్లిక్ డే నాడు మోదీకాషాయ రంగు టర్బన్ ధరించి కనిపిస్తే ఈ సారి ఇలా కనిపించడం విశేషం. దేశానికి సంబంధించిన ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ ఆయన ఇలా స్పెషల్ గా కనిపించడం ఆనవాయితీగా మారుతోంది.