స్పెయిన్ ప్రధాని భార్యకూ కరోనా.. అధికారిక నివాసంలోనే ఐసొలేషన్

| Edited By: Anil kumar poka

Mar 15, 2020 | 11:49 AM

స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్ కి కూడా  కోవిడ్-19 సోకింది. అయితే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని అధికారవర్గాలు తెలిపాయి.

స్పెయిన్ ప్రధాని భార్యకూ కరోనా.. అధికారిక నివాసంలోనే ఐసొలేషన్
Follow us on

స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ భార్య బెగోనా సాంచెజ్ కి కూడా  కోవిడ్-19 సోకింది. అయితే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని అధికారవర్గాలు తెలిపాయి. భార్యా భర్తలిద్దరూ తమ అధికారిక నివాసంలోనే ఉన్నారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా వీరు  సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నదని, పెడ్రో సాంచెజ్, ఆయన భార్య ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని తెలుస్తోంది. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్ లో ఉన్నారు. ప్రధాని ట్రూడో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 14 రోజుల పాటు తనకు తాను ఐసొలేషన్ లో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కెనడాలో కరోనా సోకిన కేసులు 103 కి పైగా పెరిగాయి.