ఖోన్సా సరిహద్దు ఎన్‌కౌంటర్.. సిక్కోలుకు చెందిన జవాన్ వీరమరణం

|

Oct 23, 2020 | 7:29 AM

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులకు అసోం రైఫిల్స్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ వీర మరణం పొందాడు.

ఖోన్సా సరిహద్దు ఎన్‌కౌంటర్.. సిక్కోలుకు చెందిన జవాన్ వీరమరణం
Follow us on

అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులకు అసోం రైఫిల్స్ మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ వీర మరణం పొందాడు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాన్ భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి తరలించారు. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయం అభిమానులు, స్థానికుల అశ్రునయనాల నడుమ సైనిక లాంఛనాలతో బాబూరావు అంత్యక్రియలు ముగిశాయి.