ఈ ట్రిక్‌తో.. వాట్సాప్‌లో డిలీట్ మెసేజ్‌లు మళ్లీ చూడొచ్చు.!

డిలీట్ మెసేజ్‌లు తిరిగి చూసే వీలుంటే బాగుంటుందని అని అనిపిస్తుంది. అలాంటి డిలీట్ డేటాను ఒక చిన్న ట్రిక్‌తో తిరిగి చూసే వీలుంది.

ఈ ట్రిక్‌తో.. వాట్సాప్‌లో డిలీట్ మెసేజ్‌లు మళ్లీ చూడొచ్చు.!
Follow us

|

Updated on: Jul 07, 2020 | 3:52 PM

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉద్యోగం.. ఇలా అన్నింటికీ ఒక్కో వాట్సాప్ గ్రూప్ మైంటైన్ చేస్తుంటాం. కొన్నిసార్లు మెసేజ్‌లు ఎక్కువైపోయి.. ఫోన్ స్పేస్ తగ్గిపోతుంది. అలాంటి తరుణంలో కొన్ని సందేశాలను మనం డిలీట్ చేస్తుంటాం. వాటిల్లో ముఖ్యమైనవి కూడా ఉండవచ్చు. ఆ డిలీట్ మెసేజ్‌లు తిరిగి చూసే వీలుంటే బాగుంటుందని అని అనిపిస్తుంది. అలాంటి డిలీట్ డేటాను ఒక చిన్న ట్రిక్‌తో తిరిగి చూసే వీలుంది. టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియో, ఫోటో ఏదైనా కూడా చూడొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం..

  • మొదటిగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ రిమూవ్ద్ + అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • యాప్ అడిగిన పర్మిషన్లు ఇస్తూనే సెటప్ పూర్తి చేసుకుని అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత ఏ యాప్‌ను సెలెక్ట్ చేయాలో అడుగుతుంది. వాట్సాప్‌ను ఎంచుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి.
  • స్క్రీన్‌పై కనిపించే ఎస్, సేవ్ ఫైల్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి.. అల్లోపై క్లిక్ చేయండి.
  • దీనితో గతంలో మీ వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లన్నీ కూడా వాట్సాప్ రిమూవ్ద్ + యాప్‌లో కనిపిస్తాయి. మీరు డిలీట్ చేసిన వాటిని కూడా చూడొచ్చు.