శివసేన బీజేపీతో జట్టు కట్టాలి, రామదాస్ అథవాలే

| Edited By: Pardhasaradhi Peri

Sep 28, 2020 | 9:08 PM

మహారాష్ట్రలో శివసేన మళ్ళీ బీజేపీతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే సూచించారు. ఈ రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ సమానంగా జరగాలని ఆయన అన్నారు. శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ఏడాదిపాటు..

శివసేన బీజేపీతో జట్టు కట్టాలి, రామదాస్ అథవాలే
Follow us on

మహారాష్ట్రలో శివసేన మళ్ళీ బీజేపీతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే సూచించారు. ఈ రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ సమానంగా జరగాలని ఆయన అన్నారు. శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే ఏడాదిపాటు సీఎం గా ఉండాలని, ఆ తరువాత ఈ పదవిని బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి అప్పగించాలని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అభివృద్దికి ఇది ఎంతయినా దోహదపడుతుందని రామదాస్ అన్నారు. ఎన్సీపీ కూడా ఎన్డీయే తో చేతులు కలపాలని కూడా ఆయన పనిలోపనిగా సూచించారు.