చైనాలో పోటెత్తిన వరదలు.. 140 మందికి పైగా మృతి ?

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 4:04 PM

చైనాలోని అనేక ప్రాంతాల్లో పోటెత్తిన వరదలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను కలుగజేశాయి. 140 మందికి పైగా ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని బీజింగ్ లోని అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల మందికి..

చైనాలో పోటెత్తిన వరదలు.. 140 మందికి పైగా మృతి ?
Follow us on

చైనాలోని అనేక ప్రాంతాల్లో పోటెత్తిన వరదలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను కలుగజేశాయి. 140 మందికి పైగా ప్రజలు మరణించడమో, గల్లంతు కావడమో జరిగిందని బీజింగ్ లోని అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా పౌరులు ఈ ప్రకృతి వైపరీత్యానికి గురయ్యారు. జియాంగ్ జీ, హుబె, హునాన్ సహా 27 రాష్ట్రాల్లో లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 28 వేల భవనాలు, కట్టడాలు దెబ్బ తిన్నాయి. సుమారు 11.7 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ప్రజలు తమ భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కోరారు.