మున్సిపల్ ఎన్నికలు.. తెరాస విజయం ఖాయం ? ఏడుగురు మంత్రులకు చిక్కులు తప్పవా ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 23, 2020 | 4:43 PM

తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ ఏడుగురు మంత్రులకు చిక్కులు తప్పకపోవచ్ఛునని పార్టీ విశ్లేషణలో తేలింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లిన పక్షంలో.. ఇందుకు బాధ్యులైన మంత్రులపై వేటు తప్పదని ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ సమావేశంలో హెచ్ఛరించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. మున్సిపల్  ఎన్నికల పోలింగ్ ట్రెండ్ ను పరిశీలిస్తే జిల్లాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను తెరాస నేతలు విశ్లేషించారు. దీని ప్రకారం.. […]

మున్సిపల్ ఎన్నికలు.. తెరాస విజయం ఖాయం ? ఏడుగురు మంత్రులకు చిక్కులు తప్పవా ?
Follow us on

తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ ఏడుగురు మంత్రులకు చిక్కులు తప్పకపోవచ్ఛునని పార్టీ విశ్లేషణలో తేలింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లిన పక్షంలో.. ఇందుకు బాధ్యులైన మంత్రులపై వేటు తప్పదని ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ సమావేశంలో హెచ్ఛరించినట్టు గతంలో వార్తలు వచ్చాయి.

మున్సిపల్  ఎన్నికల పోలింగ్ ట్రెండ్ ను పరిశీలిస్తే జిల్లాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను తెరాస నేతలు విశ్లేషించారు. దీని ప్రకారం.. ఏడుగురు మంత్రులు ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవచ్ఛునని భావిస్తున్నారు. వీరిలో కొందరు కేసీఆర్ కు సన్నిహితులు కాగా మరికొందరు కేబినెట్ లో కొత్తగా చేరినవారు. తమ సొంత మున్సిపాలిటీలలో మెజారిటీ వార్డులను కొంతమంది మినిస్టర్స్ దక్కించుకోవచ్ఛు. కానీ తమ తమ జిల్లాల్లోని ఇతర మున్సిపాలిటీలలో మెజారిటీ వార్డులను గెలుచుకోకపోతేనే చిక్కులు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని భావిస్తున్నారు.

అలాగే తాము సొంతంగా మున్సిపల్ చైర్మన్ పదవిని పొందలేని పక్షంలో కూడా చిక్కులు తప్పవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే ఎక్స్-అఫిషియో సభ్యుల సాయంతో ఈ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని జిల్లాల మున్సిపాలిటీల్లో తెరాసకు మున్సిపల్ చైర్మన్ పదవులు లభించవచ్ఛు . జెడ్పీటీసీ ఎన్నికల్లో తాము  సాధించిన విజయం ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని, ఏది ఏమైనా అన్ని మున్సిపాలిటీలను తమ పార్టీ స్వీప్ చేయవచ్చునని ఓ తెరాస నేత ధీమాగా చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చుక్కెదురు కావడం ఖాయమని కూడా ఆయన జోస్యం చెప్పారు.