40 ఏళ్ళు బీజేపీకి సేవ చేశా, మంచి ‘రివార్డే’ ఇచ్చారు, బెంగాల్ నేత

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 11:00 AM

బీజేపీ ఆఫీసు బేరర్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో దీర్ఘకాలం పార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ సిన్హా ను  పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలగించారు. ఆయన స్థానే తృణమూల్ కాంగ్రెస్ నుంచి..

40 ఏళ్ళు బీజేపీకి సేవ చేశా, మంచి రివార్డే ఇచ్చారు, బెంగాల్ నేత
Follow us on

బీజేపీ ఆఫీసు బేరర్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో దీర్ఘకాలం పార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ సిన్హా ను  పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలగించారు. ఆయన స్థానే తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన అనుపమ్ హజ్రాను నియమించారు. తనను పదవి నుంచి తొలగించినందుకు రాహుల్ సిన్హా  తన ఆవేదనను, అసంతృప్తిని అణచుకోలేకపోయారు. 40 సంవత్సరాలుగా తను పార్టీకి సేవలందించానని, అందుకు ఫలితం ఇదా అని ప్రశ్నించారు. నాకు మంచి ‘రివార్డే’ ఇచ్చారు అని వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు. మరో పది, పన్నెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని రాహుల్ తెలిపారు. . బీజేపీ పుట్టినప్పటి నుంచి నేను ఆ పార్టీకి సేవలు చేస్తూ వచ్చాను… కానీ నా సేవలకు గుర్తింపు రాలేదు అంటూ ట్విటర్ ద్వారా వీడియో మెసేజ్ ఇచ్చారు.

కాగా అనుపమ్ హజ్రా ఆయనను అనునయిస్తూ ..జీవితంలో ఒడిడుకులు సహజమేనని, సిన్హా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని ‘ఓదార్చారు’.