సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత

సీపీఐ సీనియర్ నేత తుళ్లూరు వెంకయ్య చౌదరి(80) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ఖమ్మంలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చౌదరి మృతిపట్ల సీపీఐ జనరల్ సెక్రటరీ...

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 10:15 AM

సీపీఐ సీనియర్ నేత తుళ్లూరు వెంకయ్య చౌదరి(80) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ఖమ్మంలోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చౌదరి మృతిపట్ల సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ మాజీ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వర రావు, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలతో పాటు పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా బుధవారం ఉదయం 9.30 గంటలకు సీపీఐ జిల్లా కార్యాలయానికి టీవీ చౌదరి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీవీ చౌదరి ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పలు పదవులు చేపట్టారు. సుధీర్ఘకాలం పాటు టీవీ చౌదరి సీపీఐ జిల్లా కార్యదర్శిగా చౌదరి సేవలందించారు.

అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్‌లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..