మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు ., మూడో సారి, ఈ సారైనా హాజరవుతారా ?

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 10:49 AM

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది..

మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు ., మూడో  సారి, ఈ సారైనా హాజరవుతారా  ?
Follow us on

పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 29 న ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. లోగడ రెండుసార్లు వీటిని పంపినా ఆరోగ్య కారణాలు చూపి  ఈడీ ఎదుటకు రాకుండా ఆమె గైర్ హాజరయ్యారు. ఈసారి ఆమెకు సమన్లు పంపడం ఇది మూడోసారి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద వర్ష రౌత్ ని విచారించనున్నారు. ఈ బ్యాంక్ నుంచి కొన్ని నిధుల మళ్లింపు జరిగిందని, ఈ నిధుల్లో కొంత సొమ్ము ఈమె అందుకున్నారని ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది అక్టోబరులో హౌసింగ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేష్ కుమార్ వాధ్వాన్, ఆయన కొడుకు సారంగ్, ఈ సంస్థ మాజీ చైర్మన్ వేయామ్ సింగ్ తదితరులపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ బ్యాంకుకు దాదాపు 4,335 కోట్ల మేరకు నష్టాలు కలిగించడానికి వీరు కారకులయ్యారని ముంబై ఆర్థిక నేరాల విభాగం కనుగొంది. బహుశా ఈ గల్లంతు నిధుల వ్యవహారంలో వర్ష రౌత్ హస్తం కూడా ఉండవచ్ఛునని భావిస్తున్నారు.