ఇండియాలో ఉగ్రదాడులు, పాకిస్తాన్ కు తోడ్పడిన హమీద్ అన్సారీ, సాధ్వి ప్రాచీ ఫైర్ , దర్యాప్తునకై డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Nov 25, 2020 | 2:52 PM

మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పై సాధ్వి ప్రాచీ మండిపడ్డారు. గతంలో ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడాలని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ కి సమాచారం అందించారని..

ఇండియాలో ఉగ్రదాడులు, పాకిస్తాన్ కు తోడ్పడిన హమీద్ అన్సారీ, సాధ్వి ప్రాచీ ఫైర్ , దర్యాప్తునకై డిమాండ్
Follow us on

మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పై సాధ్వి ప్రాచీ మండిపడ్డారు. గతంలో ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడాలని పాకిస్తాన్ ఐ ఎస్ ఐ కి సమాచారం అందించారని ఆమె ఆరోపించారు.  ఈ విషయంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాల రహస్య సమాచారాన్ని ఆ  సంస్థకు తెలియజేసి దాన్ని ప్రోత్సహించారని, దీనిపై ప్రధాని మోదీ ఇన్వెస్టిగేషన్  జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో మీడియాతో మాట్లాడిన సాధ్వి ప్రాచీ…హమీద్ అన్సారీ తెరచాటు బాగోతం దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. ఈ దేశ పౌరుడై ఉండి పాక్ కు తోడ్పడమేమిటని ఆమె ప్రశ్నించారు. అటు-లవ్ జిహాద్ పై చట్టం తేవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే  ఈ విషయంలో చాలా జాప్యం జరిగిందన్నారు.

మరోవైపు-హమీద్ అన్సారీని ఎం ఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి పోల్చారు. వారిద్దరూ పాకిస్తానీయుల మాదిరే మాట్లాడుతారని, వారిది అదే భాష అని ఆయన దుయ్యబట్టారు. పాక్ తో వారికి సాన్నిహిత్యం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.