రష్యాలో విపక్ష నేత నావెల్నీ విడుదల కోరుతూ వేలమంది భారీ ర్యాలీ, అరెస్టులు.

| Edited By: Pardhasaradhi Peri

Jan 31, 2021 | 7:15 PM

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సి నావెల్నీని విడుదల చేయాలంటూ ఆదివారం కొన్ని వేలమంది భారీ ర్యాలీ నిర్వహించారు. మాస్కోతో సహా అనేక నగరాల్లో వీరు పోటెత్తారు..

రష్యాలో విపక్ష నేత నావెల్నీ విడుదల కోరుతూ వేలమంది భారీ ర్యాలీ, అరెస్టులు.
Follow us on

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సి నావెల్నీని విడుదల చేయాలంటూ ఆదివారం కొన్ని వేలమంది భారీ ర్యాలీ నిర్వహించారు. మాస్కోతో సహా అనేక నగరాల్లో వీరు పోటెత్తారు. దాదాపు వెయ్యిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని నిశితంగా విమర్శించే నావెల్నీ..ఆయనకు కంట్లో నలుసులా మారారు.  ఇదే సమయంలో వేలాది అభిమానులను, మద్దతుదారులను కూడగట్టుకోగలిగారు. .   అయితే క్రమంగా పుతిన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. జర్మనీ నుంచి  ఇటీవల నావెల్నీ మాస్కో విమానాశ్రయానికి చేరగానే ఆయనను పోలీసులు గట్టి భద్రత మధ్య జైలుకు తరలించారు. క్రెమ్లిన్ సమీపంలో ఆదివారం అన్ని సబ్ వే స్టేషన్లను, బార్లను, రెస్టారెంట్లను మూసివేశారు.

అటు ఈ ర్యాలీలో నిరసనకారులు పుతిన్ రాజీనామా చేయాలని అంటూ ఆయనకు వ్యతిరేక నినాదాలు చేశారు. కొంతమంది ఆయనను ‘దొంగ’ అంటూ తీవ్రంగా దుర్భాషలాడారు. లోగడ నావెల్నీ పై విషప్రయోగం జరగగా ఆయన జర్మనీ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొంది తిరిగి వఛ్చిన విషయం తెలిసిందే.