ఒక్క ‘బంగ్లాదేశ్’ లోనే.. టీమిండియాకు అలా..

| Edited By:

May 17, 2020 | 11:57 AM

టీమిండియా మ్యాచులు ఆడుతుంటే మద్దతివ్వని దేశం ఏదైనా ఉందంటే.. అది బంగ్లాదేశ్ అని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. వాళ్ళ మద్దతు సంపాదించడం చాల కష్టమన్నాడు. 'ప్రపంచంలో మేం ఎక్కడ మ్యాచ్

ఒక్క బంగ్లాదేశ్ లోనే.. టీమిండియాకు అలా..
Follow us on

Rohit Sharma: టీమిండియా మ్యాచులు ఆడుతుంటే మద్దతివ్వని దేశం ఏదైనా ఉందంటే.. అది బంగ్లాదేశ్ అని స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. వాళ్ళ మద్దతు సంపాదించడం చాల కష్టమన్నాడు. ‘ప్రపంచంలో మేం ఎక్కడ మ్యాచ్ ఆడినా ఎంతో కొంత సపోర్ట్ లభిస్తుంది. కాని బంగ్లాలో మాత్రం ఎలాంటి సపోర్ట్ ఉండదు. ప్రపంచం మొత్తంలో బంగ్లాదేశ్ మాత్రమే ఇలా వ్యవహరిస్తుంది. ఒకప్పుడు బలహీనంగా ఉన్న బంగ్లా ఇప్పుడు బలమైన టీంగా ఎదిగింది’ అని రోహిత్ పేర్కొన్నాడు.

కాగా.. “ఆట‌లో ఏవైన పొర‌పాట్లు చేసిన‌ప్పుడు, బంగ్లా అభిమానుల రియాక్షన్ తీవ్రంగా ఉంటుంద‌ని.. అయితే , బంగ్లాదేశ్‌లో క్రికెట్ అంటే చాలా ప్యాష‌న్‌తో ఉంటార‌ని” చెప్పుకొచ్చాడు. ఇటీవ‌ల భార‌త్‌-బంగ్లాదేశ్ జ‌ట్లు ఆడుతుంటే ఇరుజ‌ట్ల అభిమానుల మ‌ధ్య‌ భావోద్వేగాలు ప‌తాక‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక 2007లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ తొలి ద‌శ‌లోనే భార‌త్ వెనుదిరిగ‌డానికి కార‌ణం బంగ్లానే కావ‌డం గమ‌నార్హం.

Also Read: తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..