మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు ? ఔరంగాబాద్ పేరు మార్పుపై తంటా, సేన ప్రతిపాదన, వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.

| Edited By: Pardhasaradhi Peri

Jan 03, 2021 | 10:56 AM

మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో చిన్నపాటి విభేదాలు తలెత్తాయి. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చాలన్న శివసేన ప్రతిపాదనను..

మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో విభేదాలు ? ఔరంగాబాద్ పేరు మార్పుపై తంటా,  సేన ప్రతిపాదన, వ్యతిరేకిస్తున్న  కాంగ్రెస్.
Follow us on

 Renaming Of Aurangabad:మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో చిన్నపాటి విభేదాలు తలెత్తాయి. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చాలన్న శివసేన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ ప్రస్తావిస్తూ..నిజానికి రెండేళ్ల క్రితమే శివసేన ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, ఇప్పుడు మళ్ళీ లేవనెత్తిందని అన్నారు.  అయితే మంత్రివర్గ సమావేశంలో ఇది ప్రస్తావనకు వచ్చినప్పుడు మా వ్యతిరేకతను తెలియజేస్తాం అని ఆయన చెప్పారు. ఈ అంశంపై శివసేన తన అధికార ‘సామ్నా’ పత్రికలో వివరిస్తూ ఔరంగాబాద్ పేరు మార్పును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. మా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు చీలిక వస్తుందా అని ఆ పార్టీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది అని వ్యాఖ్యానించింది. 30 ఏళ్ళ క్రితం ఈ నగరాన్ని శంభాజీ నగర్ గా  బాలాసాహెబ్ థాక్రే మార్చారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించారు. అయితే దీన్ని ఇప్పుడు అధికారికంగా మార్చాల్సి ఉంది అని సేన పేర్కొంది.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎందుకు మార్చలేదో తెలియడంలేదని  సేన ప్రశ్నించింది. కావాలనే విస్మరించినట్టు కనబడుతోందని అభిప్రాయపడింది. ఛత్రపతి శివాజీ జ్ఞాపకాలకు ఔరంగజేబ్ పేరుతో ముడి పెట్టడం సమంజసమా.. అది  శివాజీకి అవమానకరమని ఈ పార్టీ వ్యాఖ్యానించింది. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వానికి ఢోకా లేదని అంటున్నారు.

 

Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు..

Corona Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

సింఘు బోర్డర్ లో కంటెయినర్ ట్రక్ ని ఇంటిగా మార్చేసిన రైతు, క్రియేటివిటీ అంటే ఇదే ! అన్ని సౌకర్యాలూ ఉన్నాయి మరి