‘తప్పుడు న్యాయమంటే ఇదే’ ! రియా అరెస్టుపై లాయర్

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2020 | 6:18 PM

తన క్లయింట్ రియా చక్రవర్తి అరెస్టును 'తప్పుడు న్యాయంగా' ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే అభివర్ణించారు.మూడు దర్యాప్తు సంస్థలు ఏకాకిగా మిగిలిన  ఓ మహిళను వెంటబడి వేధించాయని..

తప్పుడు న్యాయమంటే ఇదే ! రియా అరెస్టుపై లాయర్
Follow us on

తన క్లయింట్ రియా చక్రవర్తి అరెస్టును ‘తప్పుడు న్యాయంగా’ ఆమె తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే అభివర్ణించారు.మూడు దర్యాప్తు సంస్థలు ఏకాకిగా మిగిలిన  ఓ మహిళను వెంటబడి వేధించాయని, మానసిక సమస్యలతో బాధ పడే ఓ డ్రగ్ అడిక్ట్ (సుశాంత్ సింగ్) ని ప్రేమించడమే ఆమె చేసిన తప్పిదమైందని ఆయన అన్నారు. సుశాంత్ ఎన్నో ఏళ్లబాటు ముంబైలోని అయిదుగురు ప్రముఖ సైయాట్రిస్టుల పర్యవేక్షణలో ఉంటూ వచ్చాడని, అక్రమంగా ప్రిస్క్రైబ్ చేసిన మందులను తీసుకుని సూసైడ్ కి పాల్పడ్డాడని సతీష్ మాన్ షిండే పేర్కొన్నారు. ఈ అక్రమ ప్రిస్క్రిప్షన్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో తేలాల్సి ఉందన్నారు.