Reliance Jio: జియో దిద్దుబాటు చర్యలు.. ఆ ప్లాన్‌లో అదనపు డేటా..

|

Jul 24, 2024 | 2:27 PM

ఖాతాదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిశీలించిన తర్వాత జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మారిన నిబంధనల ప్రకారం ఈ ఫ్లాన్ ధర మారదు. అలాగే ఎస్ఎమ్ఎస్ లు, రోజు వారీ డేటా కూడా అలాగే ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రం 28 రోజుల నుంచి 30 రోజులకు పెరుగుతుంది. ఆ రెండు రోజులు కూడా 2 జీబీ చొప్పున డేటా అందిస్తారు.

Reliance Jio: జియో దిద్దుబాటు చర్యలు.. ఆ ప్లాన్‌లో అదనపు డేటా..
Reliance Jio
Follow us on

దేశంలోని టెలికాం కంపెనీలలో రిలయన్స్ జియో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. మెరుగైన నెట్ వర్క్, ఖాతాదారులకు అనుకూలమైన రీచార్జి ప్లాన్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యండా డేటా అందించే విషయంలో మిగిలిన కంపెనీలతో పోల్చితే ముందుంటుంది. అయితే జియో రీచార్జ్ ప్లాన్ల ధరలు ఇటీవల పెరిగిపోయాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. ధర పెంపును నిరసిస్తూ కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు, కామెంట్లు పెట్టారు.

రూ.349 ప్లాన్ వ్యాలిడిటీ పొడిగింపు..

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలో ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. వివాహం అనంతరం జియో ఖాతాదారులకు ఆ కంపెనీ శుభవార్త చెప్పింది. రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌కు కొన్ని సవరణ చేసింది. దాని వ్యాలిడిటీ 28 రోజులుగా కాగా 30 రోజులకు పొడిగించింది.

కస్టమర్ల ఫీడ్ బ్యాక్..

ఖాతాదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిశీలించిన తర్వాత జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మారిన నిబంధనల ప్రకారం ఈ ఫ్లాన్ ధర మారదు. అలాగే ఎస్ఎమ్ఎస్ లు, రోజు వారీ డేటా కూడా అలాగే ఉంటాయి. వ్యాలిడిటీ మాత్రం 28 రోజుల నుంచి 30 రోజులకు పెరుగుతుంది. ఆ రెండు రోజులు కూడా 2 జీబీ చొప్పున డేటా అందిస్తారు. దీని వల్ల ఖాతాదారులకు రెండు రోజులు అదనంగా సేవలు అందుతాయి. వాటికి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించనవసరం లేదు.

రెండు రోజులు అదనం..

జియో చేసిన మార్పుల ప్రకారం ప్రస్తుతం వినియోగంలో ఉన్న రూ.349 ప్లాన్ ద్వారా 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2 జీబీ డేటా పొందవచ్చు. గతంలో 28 రోజుల సమయంలో 56 జీబీ డేటా మాత్రమే లభించింది. ఇప్పుడు 30 రోజులకు వ్యాలిడిటీ పెరగడంతో 60 జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా జియో ట్రూ 5 జీ సేవలు ఉన్న ప్రాంతాలలో ఖాతాదారులకు అపరిమిత 5 జీ ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందవచ్చు.

ఉపశమనం..

జియో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఖాతాదారుల ఫీడ్ బ్యాక్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. రీచార్జి ప్లాన్ల ధరలు పెరగడంతో ఖాతాదారులకు కలిగిన ఇబ్బంది నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించడానికి ఈ మార్పులు చేసినట్టు సమాచారం. అయితే ఇతర ప్లాన్లను కూడా మార్చే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ధరలు పెరగక ముందు రూ.349 ప్లాన్ ధర రూ.299 మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ ఒక్క రీచార్జి ప్యాక్ పై మాత్రమే చెల్లుబాటు కాల వ్యవధిని పెంచింది.

పెరిగిన రీచార్జి ప్లాన్ల ధరలు..

జియో కంపెనీ గత నెలలో తన రీచార్జి ప్లాన్ల ధరలను పెంచింది. అన్ లిమిడెట్ కాల్స్ తో పాటు రోజుకు 1 జీబీ డేటా ఇచ్చే రూ.209 ప్యాక్ ను రూ.249కి, అలాగే రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చే రూ.666 (84 రోజులు) ప్లాన్ ను రూ.799కి, రోజుకు రూ.2.5 జీబీ డేటా అందించే రూ.2,999 విలువైన వార్షిక ప్లాన్ ను 3,599కు పెంచింది. వీటికి అదనంగా డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, పోస్ట్‌ పెయిడ్ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..