ఏటీఎం లను ఖాళీగా ఉంచితే….

|

Jun 14, 2019 | 5:54 PM

నగదు లేక అలంకార ప్రాయంగా మారుతున్న ఏటీఎం లతో వినియోగదారులు ఉసూరుమంటున్న నేపథ్యంలో వారికి భారీ ఊరట కల్పించే అత్యంత ప్రధాన నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుంది. వీటిలో క్యాష్ లేకుండా మూడు గంటలకు మించి డ్రై గా ఉంచిన పక్షంలో.. ఆయా బ్యాంకులకు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. మూడు గంటలకు మించి వీటిని డ్రై గా ఉంచరాదని, అలా చేస్తే జరిమానా పడుతుందని, ఇది ప్రాంతాలవారీగా ఉంటుందని ప్రకటించింది. చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో […]

ఏటీఎం లను ఖాళీగా ఉంచితే....
Follow us on

నగదు లేక అలంకార ప్రాయంగా మారుతున్న ఏటీఎం లతో వినియోగదారులు ఉసూరుమంటున్న నేపథ్యంలో వారికి భారీ ఊరట కల్పించే అత్యంత ప్రధాన నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుంది. వీటిలో క్యాష్ లేకుండా మూడు గంటలకు మించి డ్రై గా ఉంచిన పక్షంలో.. ఆయా బ్యాంకులకు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. మూడు గంటలకు మించి వీటిని డ్రై గా ఉంచరాదని, అలా చేస్తే జరిమానా పడుతుందని, ఇది ప్రాంతాలవారీగా ఉంటుందని ప్రకటించింది. చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఏటీఎం లు గంటలతరబడే కాక, రోజుల తరబడి కూడా నగదు లేక బోసిపోయి ఉంటున్నాయి.

దీంతో బ్యాంకుల్లో కస్టమర్ల క్యూలు చాంతాడంత ఉంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ఆర్ బీ ఐ ఇక చర్యలకు ఉపక్రమించింది. ఏటీఎం ఇంటర్ ఛేంజి ఫీ స్ట్రక్చర్ ని సమీక్షించేందుకు ఇటీవల కమిటీని నియమించిన ఈ బ్యాంకు.. సాధ్యమైనంత త్వరగా సిఫారసులను సమర్పించాల్సిందిగా ఈ కమిటీని కోరింది. ఈ కమిటీ ఏటీఎం చార్జీలు, ఫీజుల వ్యవహారాన్ని మొత్తం పరిశీలించనుంది. అలాగే ఏటీఎం ల లావాదేవీలకు సంబంధించిన అన్ని అంశాలను సైతం పరిశీలించి సాధ్యమైనంత త్వరలో సూచనలు, సలహాలతో ఓ రిపోర్టు అందజేస్తుందని తెలుస్తోంది. కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న వెంటనే ఇక తన ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంకు ఆచరణలో పెట్టవచ్చు.