బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త మూవీ

|

Sep 06, 2020 | 8:20 PM

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 'మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చరణ్ మూవీ ఫైనల్ అయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త మూవీ
Follow us on

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చరణ్ మూవీ ఫైనల్ అయినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వంశీ పైడిపల్లి చరణ్ కి స్క్రిప్ట్ వినిపించాడని.. దీనికి చరణ్.. చాలా బావుంది.. సూపర్బ్ అంటూ రియాక్టయ్యాడని తెలుస్తోంది. పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నాడట వంశీ పైడిపల్లి. పూర్తి యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందించే ఈ సినిమా.. చరణ్ కి మరో పాన్ ఇండియా మూవీ కానుందని సమాచారం. ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ తరువాత వంశీ చేస్తున్న సినిమా కావడం, చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తరువాత చేసే సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలుండటం సహజమేకదా. కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్ గురించి అనేక వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే.